![]()
న్యూస్ ( జనస్వరం ) : జనసేనపార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా టొరంటో, మరియు వాంకోవర్ మహానగరాల్లో కెనడా జనసేన టీం ముందస్తుగా ఈ వారాంతంలో 11th మార్చ్ శనివారం నాడు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కెనడా జనసైనికులు మాట్లాడుతూ 2024 ఏప్రిల్ ఎన్నికలకు ఎలా సంసిద్ధం కావాలి అనే దాని మీద వివరంగా చర్చించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెనడా జనసేన టీం 14 లక్షల రూపాయలు పైగా విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అధికారం వైపుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ పోరాటంలో తమ వంతు మద్దతు నిలవడానికి నాలుగు వందల పైచిలుకు కెనడా జనసైనికులు ఒక్కొక్కరు తమ తమ నియోజకవర్గంలోని వందమంది కుటుంబాలను ప్రభావితం చేస్తామని ప్రకటించారు. జనసేన వీర మహిళలు కేక్ కట్ చేసి ఆవిర్భావ సభ వేడుకలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. క్రియాశీలక సభ్యత్వం యొక్క విశిష్టతను పవన్ కళ్యాణ్ గారి ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ సభ్యుల భద్రత కొరకు తన సొంత ఖర్చులతో కోటి రూపాయల మ్యాచింగ్ ఫండ్ ఇచ్చారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి వీడియో సందేశాలను ప్రదర్శించి ఆహ్లాదభరిత వాతావరణంలో వేడుకలను నిర్వహించారు. కెనడా జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న”Know Your Leader” ప్రోగ్రాం లో భాగంగా లోకల్ గా ఉన్న జనసేన నాయకులతో ప్రతి వారాంతంలో కెనడా జనసేన టీం చర్చలు జరుపుతూ స్థానిక సమస్యల మీద, అధికార పార్టీ అవినీతి పాలనా వివరాలు తెలుసుకుంటూ వచ్చే ఎలక్షన్స్ లో యుద్ధానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుంటున్నారు. మార్చి 14 మచిలీపట్నం లో పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని, లై వ్ లో వీక్షిస్తామని తెలియజేశారు.