అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ మంగళవారం రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఇది ఓర్వలేక రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారు. ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా వైసీపీ ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 7లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అని తెలియగానే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి మేము మీ అకౌంట్ లోకి 7 లక్షల రూపాయలు వేయిస్తాం మీరు పవన్ కళ్యాణ్ సభకు వెళ్లవద్దని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను హెచ్చరించారని పలు మీడియా కథనాలలో కూడా ఈ విషయం వెల్లడయింది. అయినప్పటికీ రైతు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామని ధైర్యంగా సభకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భయపడి మాత్రమే వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందే తప్ప నిజంగా ప్రజలమీద ప్రేమతో పనిచేయడం లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీరు పవన్ కళ్యాణ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజంగా యువతకు రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక మీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత తప్పుదోవ పడుతుందని మేము తెలియజేస్తున్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో విపరీతమైన కరెంటు కోతలవల్ల ఇటు రైతాంగం గాని అటు పరిశ్రములు గాని పూర్తిగా చతికల పడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ముందు మీ ప్రభుత్వం ప్రజలకు కోతలు లేని కరెంటు అందించి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై మీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి మీది కాదని పెండ్యాల శ్రీలత మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు గుండాల మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి పాల్గొన్నారు.