పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి : జనసేన నాయకులు సి.రాజ శేఖర్‌

        పత్తికొండ,  (జనస్వరం) :  పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ రంగంలో అత్యంత విలువైన మార్కెట్‌ టమోటా మార్కెట్‌. ఈ టమోట తాలూకా పరిధిలో ఉండే అన్ని గ్రామాలలో నివసించే రైతులు 75% టమోటా పంటను పండిస్తూ జీవనాధారం చేస్తున్నారు. మన రాష్ట్రంలో మదనపల్లె తర్వాత రెండో పెద్ద మార్కెట్‌ పత్తికొండ మార్కెట్‌. కావునా ప్రభుత్వం వెంటనే స్పందించి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని పక్క నియోజకవర్గాలకు మళ్లించకుండా పత్తికొండలో ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ నాయకులు సి.జి రాజు శేఖర్‌ గారు  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.