అనంతపురం, (జనస్వరం) : టమోటా, మిరప రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని... బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రలో వైఎస్. జగన్ ప్రభుత్వం రైతులుపండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి కూడా సరైన సమయంలో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే రైతు నిధి రూ. 8 వేలకోట్లతో ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. తక్షణమే రైతు నిధి నుండి డబ్బులు విడుదల చేసి, కష్టకాలములో రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. అనంత జిల్లాలో అన్నదాతల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ఒక నెల వ్యవధిలోనే దాదాపు ఆరుగురు రైతులు అప్పుల భాదలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతాంగంపై చిత్తశుద్ది ఉంటే తక్షణమే బలమన్మరణాలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలని... టమోట, మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరామిరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com