
నూజివీడు ( జనస్వరం ) : నవ భారత నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి 66వ వర్థంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు. స్థానిక యువతతో కలిసి నూజివీడు మండల దిగవల్లి-కండ్రీక, ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక జాతికి, కులానికి చెందినా నాయకులు కాదని ప్రపంచలో అతి గొప్ప శక్తివంతమైన నాయకులలో ఒకరని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత సమా సమాజాన్ని స్థాపించి ఐక్యంగా ఉండాలని నేటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అప్రజాస్వామ్య పాలన చేస్తున్నారు. యువత అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, చేకూరి సాయి స్థానిక అంబేడ్కర్ యువత గడ్డం సతీష్, జగదీష్, లక్కీ, సూర్య, చందు, కుమార్ తదతరులు పాల్గొన్నారు.