
గుంతకల్లు ( జనస్వరం ) : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని స్మరించుకుంటూ గుంతకల్ పట్టణం బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి కారణం అంబేద్కర్ లాంటి మహనీయుడని , భారతీయ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్టడుగున ఉన్న వర్గాలను సైతం చట్టసభల వైపు నడిపించేలా ప్రతి ఒక్కరికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. వర్తమాన సమాజం మన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలని, అణగారిన వర్గాల ఉన్నతి కోసం చర్చల్లో తన అభిప్రాయాన్ని ఎంత బలంగా వినిపించేవారు ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆయన ఆశయాలను అవగాహన చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని యువతని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, పామయ్య, రమేష్ రాజ్, మంజునాథ్, రామకృష్ణ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, గంగాధర్, అనిల్ కుమార్ అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు ధనరాజ్ బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ వినోద్, రాజశేఖర్, శంకర్, రవికుమార్, సుమన్, మను తదితరులు పాల్గొన్నారు.