తిరుపతి, జనవరి 27: శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ఆదివారం తిరుపతిలో సంక్రాంతి సాహిత్య, సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధానకార్యదర్శి అరవ జయపాల్ తెలిపారు. ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కార్యక్రమం వుంటుందన్నారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ప్రారంభసభకు అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ముఖ్యఅతిథులుగా టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, యస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. శ్రీకాంత్ రెడ్డి హాజరవుతారన్నారు. విశిష్ట అతిథులుగా తుడా ఛైర్మన్ మోహిత్ రెడ్డి, శ్రీశ్రీ కళావేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రఖ్యాత రచయిత డా. రాసాని వెంకట్రామయ్య, గౌరవ అతిథులుగి సీనియర్ సాహితీవేత్త సాకం నాగరాజు, ప్రముఖ రచయిత, రేడియో స్టేషన్ విశ్రాంత డైరెక్టర్ మల్లేశ్వర రావు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, ఆత్మీయ అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పల్లిపట్టు నాగరాజు, ఇతర సాహితీ ప్రముఖులు హాజరవుతారని వివరించారు. జిల్లాలోని కవులు, రచయితలు, జానపద కళాకారులు భారీగా హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధ్యాహ్నభోజనం కూడా ఏర్పాటుచేశామన్నారు. కవులు, కళాకారులకు ప్రశంసాపత్రం, శాలువా, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సత్కరిస్తామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com