Logo
Date of Publish : 19 December 2022, 4:01 pm
Editor : Sake Naresh

సోమశిల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు అందించాలంటే జనసేన రావాలి

           ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, ఈరోజు 37వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా  ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మేదర వీధి ఎస్టి కాలనీ ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ సాగింది. దశాబ్దాలుగా దగాకు గురికాబడ్డ ఆత్మకూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. చుక్కల భూముల సమస్యను సుమోటోగా పరిష్కరించాలన్నా, నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గాన్ని పూర్తి చేయాలన్నా, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలన్నా, సమగ్ర సోమశిల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సోమశిల జలాలను అందించాలన్నా, నియోజకవర్గంలో పరిశ్రమలను స్థాపించి పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా జనసేన పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, రాజేష్, శ్రీను, నాగేంద్ర, భాను, హజరత్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com