
ఆత్మకూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం, ఈరోజు 37వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మేదర వీధి ఎస్టి కాలనీ ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ సాగింది. దశాబ్దాలుగా దగాకు గురికాబడ్డ ఆత్మకూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరారు. చుక్కల భూముల సమస్యను సుమోటోగా పరిష్కరించాలన్నా, నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గాన్ని పూర్తి చేయాలన్నా, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరమే పూర్తి చేయాలన్నా, సమగ్ర సోమశిల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సోమశిల జలాలను అందించాలన్నా, నియోజకవర్గంలో పరిశ్రమలను స్థాపించి పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా జనసేన పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, రాజేష్, శ్రీను, నాగేంద్ర, భాను, హజరత్, తదితరులు పాల్గొన్నారు.