
మండపేట ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తీవ్ర మనోవేదనకు గురిఅయ్యారని ఇక తొలకరి పంట విరామంకు సిద్ధపడుతున్నట్లు మండపేట అఖిలపక్షం నేతలు జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కాంగ్రెస్ ఇంచార్జ్ కామన ప్రభాకరరావు, బీజేపీ ఇన్ ఛార్జ్ కోన సత్యనారాయణ లు పేర్కొన్నారు. ధాన్యం సొమ్ము సకాలంలో చేతికందక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సొమ్ము చెల్లించాని కోరుతూ సోమవారం నియోజకవర్గ కేంద్రం మండపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ ధాన్యం తోలి మూడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు సొమ్ము చేతికందక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలకరి సీజన్ ప్రారంభమై నాట్లు వేయాల్సిన సమయంలో కూడా డబ్బులేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అప్పులు చేసి ధాన్యం పండి స్తే డబ్బులు చేతికి రాక వడ్డీ తడిసి మోపెడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్సార్సీపీ నేతలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం లోగా సొమ్ములు చెల్లించని పక్షంలో ఆందోళ ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కోనసీమ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో క్రాఫ్ హాలిడే ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని మండపేట నియోజకవర్గంలో మాత్రం రైతులకు డబ్బు జమ చేయలేదని తెలిపారు. ఎరువులకి డబ్బులు లేక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి రేపటిలోగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని సోమవారం సాయంత్రం లోగా సొమ్ములు రైతులకు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.