
ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పల్లెపల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా… ఈరోజు సంగం మండలంలోని జెండా దిబ్బ, మక్తాపురం, అన్నారెడ్డి పాలెం, దువ్వూరు గ్రామ పంచాయతీలోని (గ్రామాలను సందర్శించి, అక్కడి స్థానిక సమస్యలను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాడేందుకు మరియు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పల్లెపల్లెకు జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున, ప్రజల కోసం జనసేన పార్టీ పనిచేస్తుందని అధికారంలోకి కూడా వస్తుందని, మీ గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు తెలపాలని, మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పోరాడుతానని ఆయన అన్నారు. ఊరూరు తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజా నాయకుడిగా ఆత్మకూరు జనసేన ఇంచార్జ్ నలిశెట్టి శీధర్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, భాను, బండి అనిల్ రాయల్, జనసేన అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.