సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ (జనస్వరం): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, డీఎంఏసీ సభ్యుడు షేక్ సైదా ఆధ్వర్యంలో టీజేఏ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 46 మంది విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. హుజూర్‌నగర్ పట్టణంలోని జిప్సీ చిల్డ్రన్స్ హోమ్‌లో జిల్లా కమిటీ సభ్యులతో కలిసి 16 మంది విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్నులు అందజేశారు. ఇప్పటికే గరిడేపల్లి మండలంలో 30 మంది విద్యార్థినులకు కూడా నోట్‌బుక్కులు, పెన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యా సంవత్సరం పొడవునా నోట్‌బుక్కులు అవసరమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. టీజేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రమణారావు ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేయడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోతుల దయాసాగర్, జిప్సీ చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ దన్పాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా కమిటీ సభ్యులు కొత్తపల్లి మధుసూదన్, భీమపంగు వెంకటేశ్వర్లు, కొల్లోజు నాగేంద్రచారి, బయ్యారపు రవీంద్ర, పెందుర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
