తిరుపతి, (జనస్వరం) : హుదూద్ తుఫాన్ వస్తేనో, సునామీ లాంటివి వస్తేనో ప్రజలు చనిపోవడం చూస్తూ ఉంటాం, కానీ తిరుపతిలో నిన్న రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే "వెస్ట్ చర్చి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి లో నీళ్లు నిలబడి కొత్తగా పెళ్లి అయిన పెళ్లి కూతురు గారు చనిపోవటం ఎంతో బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ "జనసేన పార్టీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్లు బాగు చేయాలి అని డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలి అనే దానిమీద గతంలో జనసేన పార్టీ ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియ చేసినప్పటికీ, ఈ ప్రభుత్వం మాకు పట్టనట్లు వ్యవహరిస్తుంది, వీరికి దీక్షల మీద పెట్టిన దృష్టి ప్రజా సమస్యల మీద అద్వానంగా ఉన్న రోడ్లమీద లేదు. తిరుపతి పట్టణం నందు ఇప్పటికైనా ఈ డ్రైనేజీ వ్యవస్థను, అద్వానంగా ఉన్న రోడ్లను వెంటనే బాగుచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com