తిరుపతి ( జనస్వరం ) : గత నాలుగు సంవత్సరాలు వైకాపా పాలనొచ్చినప్పటి నుండి కబ్జాలు, దోపిడీలు, అరాచకాలు, నేరాలు, పెరిగిపోయాయని ఈ బాధల నుండి విముక్తి ఎప్పుడొస్తుందా అని ఈ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత “జనసేనాని” (పవన్ కళ్యాణ్)ఈ దోపిడి వైకాపా పాలనను ఓ మగాడిలా ప్రశ్నిస్తుంటే చూస్తున్న ప్రజలు వైసీపీని ఎదిరించే ఓ మగాడు వచ్చాడన్న ధైర్యంతో ఉన్నారని జనసేన నేతలు తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ కొనియాడారు. స్థానికి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో కిరణ్ రాయల్, బత్చేన మధుబాబు, ముక్కు సత్యవంతుడు, హేమ కుమార్, కొండా రాజమోహన్, సుమన్ బాబు, హేమంత్, బాలాజీ, పురుషోత్తం రాయల్, సాయిలు మాట్లాడుతూ రాజమండ్రి ప్రాంతంలోని పాలక పార్టీ కాపు మంత్రులను హెచ్చరిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన కులానికే న్యాయం చేయలేదని, అలాంటిది కాపులకు ఏదో ఓరగబెడతాడని పాలక కాపు మంత్రులు జగన్ వారసులుగా మాట్లాడడం విడ్డూరమన్నారు. వైకాపా కాపులు ఇలానే వ్యవహరిస్తే, రాబోయే ఎన్నికలలో వీరిని నిజమైన కాపులు బహిష్కరిస్తారని హెచ్చరించారు, ప్రజలకు మేలు చేయాల్సిన ఈ మంత్రులు, జనసేనను టార్గెట్ గా పెట్టుకుని తిని, తాగి విమర్శించడం సరికాదని నిప్పులు చెరిగారు. తమ జనసేనానిని విమర్శించే మంత్రి బొత్స నోటికి ఆపరేషన్ చేయాలని చురకలు విసిరారు. జగన్ కు తొత్తులుగా పనిచేస్తున్న కాపు మంత్రులు ఇకనైనా మారాలని హెచ్చరించారు.