
తిరుపతి ( జనస్వరం ) : నేడు జరగనున్న తిరుపతి నియోజకవర్గ సమన్వయ సమావేశానికి సంబంధించి మంగళవారం జనసేన నగర కమిటీతో జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భేటీ అయ్యారు. డివిజన్ అధ్యక్షులతో పాటు నగర కమిటీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. టిడిపితో ఉమ్మడిగా చేపట్టవలసిన కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, నగర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.