తిరుపతి, ఏప్రిల్ 16 (జనస్వరం) : తిరుపతిలో జనసేన టీడీపీ బీజేపీ నాయకుల అబ్సర్వర్ పేరాల శేఖర్ రావు, జనసేన జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు భాను ప్రకాష్, ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులు ఉమ్మడి సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి నాయకుల సమావేశంలో జనసేన బీజేపీ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లాలా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి తిరుపతి లోని రాష్ట్ర జిల్లా నగర వార్డ్ బూత్ నాయకులు అందరూ తిరుపతి ఎమ్మెల్యే గుర్తు గాజు గ్లాసు*, ఎంపీ గుర్తు బీజేపీ కమలం గుర్తు* అని ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా మనం కృషి చేయాలి అని సోషల్ మీడియా మధ్యమాల్లో అందరికి తెలిసేలా ప్రతి ఒక్కరు పనిచేయాలి అని ఉమ్మడి నాయకులతో దిశనిర్దేశం చేసారు. ఉమ్మడి పార్టీలు క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నాయి మనం ఈ ఎన్నికల్లో NDA ప్రభుత్వం స్థాపించేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. జనసేన బీజేపీ టీడీపీ నేతలు కలసి పార్టీ శ్రేణులు ఉమ్మడిగా పార్టీ అధినాయకత్వం సూచించిన కార్యాచరణ అర్థమయ్యేలా చూడాలని ఉమ్మడి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో మన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులుని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని గెలిపించి ఉమ్మడి అధి నాయకులకు కానుకగా ఇద్దాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఊక విజయ్ కుమార్,బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, జనసేన జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ మహిళా కోఆర్డినేటర్ ఆకుల వనజ, జిల్లా కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకురాలు జయంతమ్మ ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com