తిరుపతి ( జనస్వరం ) : రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్లని కూడా రాజకీయ నాయకులుగా చేసిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు ఉమ్మడి చిత్తూర జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం ఆయన తిరుపతి ఒకటో వార్డు అధ్యక్షులు వంశీ మరియు నరేష్ ఆధ్వర్యంలో జనసేన వార్డుబాట కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెంట యువత మాత్రమే కాదని పెద్దలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నారన్నారు. రాజకీయాల్లోకి కొందరు సంపాదించుకునేందుకు వస్తే పవన్ కళ్యాణ్ ఆశయం కోసం వచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన జన సునామీలా జనాలు వస్తున్నారన్నారు. తిరుపతిలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, కార్యదర్సులు ఆనంద్, బాటసారి, నగర ఉపాధ్యక్షులు మల్లిశెట్టి లక్ష్మి, కార్యదర్శులు కిరణ్ కుమార్, రవి, పురుషోత్తం రాయల్, హేమంత్, నవీన్, సాయి, పురుషోత్తం, సీనియర్ నాయకులు, అర్బన్ అధ్యక్షులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు మనోజ్ కుమార్, జనసైనికులు మోహిత్, ఇంద్ర, జనసైనికులు వీరామహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com