తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ పసుపులేటి హరి ప్రసాద్ గారి ఆదేశాల మేరకు తిరుపతి నియోజకవర్గ వీరమహిళా విభాగం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం జనసేన పార్టీలో ఝాన్సీ లక్ష్మి భాయి వీరనారిగా పోలుస్తూ ప్రత్యేక స్థానం ఇచ్చారని అన్నారు. మహిళలు వారి ఆలోచనలు, వారి భావాలను పంచుకోవడం జరిగింది. మహిళలను వెన్నుండి ప్రోత్సహిస్తే వారు సాధించలేని విజయాలు ఏవి వుండవని తెలియజేశారు. ఈ సృష్టికర్థ అయినటువంటి మాతృ మూర్తిని గౌరవించేలా సమాజంలో వ్యక్తుల దోరణిలో మారాలని తెలియజేశారు. మహిళలందరూ జనసేనపార్టీ బలొపేతానికి కృషిచేయాలని, అలాగే పార్టీలో మహిళలకు తగు గౌరవం, సముచిత ప్రాధాన్యత లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకేపాటి సుభాషిణి, కీర్తన గార్లు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com