Logo
Date of Publish : 07 April 2022, 10:20 am
Editor : Sake Naresh

వృద్ధులకు సకాలంలో పింఛన్లు అందజేయాలి : శింగనమల మండల జనసేన నాయకులు

    శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, శింగనమల మండలంలోని వివిధ గ్రామాల్లో నేటికీ వృద్ధాప్య పెన్షన్లు అందలేదు. పెన్షన్లు సక్రమంగా సకాలంలో అందక గ్రామాల్లోని పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందిస్తూ జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి, మండల అధ్యక్షుడు తోట ఓబులేసు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఒకటో తారీఖున సకాలంలో పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది కానీ, నేటికీ కూడా పెన్షన్ ఇవ్వకుండా వృద్ధులుకు, వితంతువులకు, వికలాంగులకు పండగ పూట కూడా ఫించన్లు ఇవ్వక వారికి తీరని అన్యాయం చేస్తోందని వారికి కనీసం పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదో కూడా అధికారులు తెలియజేయలేక పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోట ప్రవీణ్, సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com