Logo
Date of Publish : 07 December 2020, 5:43 pm
Editor : Sake Naresh

రైతులకు సకాలంలో పంట నష్టపరిహారాన్ని అందజేయాలి : పర్చూరు జనసేననాయకులు

రైతులకు సకాలంలో పంట నష్టపరిహారాన్ని అందజేయాలి : పర్చూరు జనసేన నాయకులు

      నివర్ తుఫాను ప్రభావంతో అపారమైన పంటనష్టాన్ని మూటగట్టుకున్న రైతులకు సకాలంలో పంట నష్టపరిహారాన్ని అందజేయాలని
పర్చూరు జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పర్చూరు బొమ్మలసెంటర్లో సోమవారం రైతులపక్షాన దీక్షను జనసేనపార్టీ నాయకులు విజయ్, తిమ్మసముద్రం శ్రీకాంత్ (NRI), జనసేన వీర మహిళ కొలసాని లక్ష్మీ శీనుబాబుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ నివర్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ.పదివేలు ఇవ్వాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటంతో సూచించారన్నారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు రైతులకు అండగా ఉంటామని తెలియజేస్తూ దీక్ష చేయడం జరిగిందని తెలిపారు. నష్ట పరిహారం ఎకరాకు రూ.35 వేలు చొప్పున అందజేయాలని నినదిస్తూ ర్యాలీగా తరలివచ్చి డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. రైతులకు ఎల్లప్పుడూ జనసేనపార్టీ శ్రేణులు అందరూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు, కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హితవు పలికారు. ప్రభుత్వం అలా సకాలంలో, సక్రమంగా అందించక మీనమేషాలు లెక్కించడం చేస్తే తదనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో. పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మార్టూరు శ్రీనివాసరావు, నూతలపాడు వెంకటేష్, చిమటవారిపాలెం అయ్యప్ప, స్వర్ణ చిరంజీవి, రావూరు పవన్, సాయి‌, బోడాడ చిన్ను, ఇంకోల్ మహేష్, కడవకూరు సందు శీను,పలువురు బీజేపీ నాయకులు, పోలూరు, పెనవల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com