Logo
Date of Publish : 07 January 2023, 2:56 pm
Editor : Sake Naresh

మంత్రి రోజా దుకాణం ఆంధ్రప్రదేశ్ లో మూత పడే సమయం ఆసన్నమైంది : దారం అనిత

         మదనపల్లి ( జనస్వరం ) : ఆంధ్ర రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా మెగా ఫ్యామిలీని దూషించడం తన అవివేకాన్ని తెలియజేస్తోందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈరోజు వరకు పర్యటనలు చేయడం తప్ప పర్యటక శాఖ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. అలాంటి ఆమె 2012 నుండి 2014 వరకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారి హయాంలో పర్యటక శాఖ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారని ఒక్కసారి తిరిగి చూసుకోవాలి. అదేవిధంగా కరోనా సమయంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేని సమయంలో దాదాపు 30 కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ సిలిండర్లను అందించిన దాత చిరంజీవి గారు అదేవిధంగా వైకాపా ప్రభుత్వం ప్రభుత్వాన్ని స్థాపించాక రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలు వీధిన పడి ఆర్తనాదాలు చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదు. దేశవ్యాప్తంగా కానీ ఏ ఎక్కడైనా సరే భూకంపాలైన వరదలైన సంభవిస్తే మొట్టమొదట స్పందించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీ వాళ్ళే అదే విధంగా నేత్రదానంలో గాని రక్తదానంలో కానీ సేవా కార్యక్రమంలో కానీ ఎల్లప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇలాంటి మెగా ఫ్యామిలీని తాను మంత్రిగా అవ్వగానే చిరంజీవి గారి కలిసిన రోజా గారు తన సినిమా నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మెగా ఫ్యామిలీని ఈరోజు పదవి కోసం దిగజారుడు మాట మాట్లాడటం అనేది ఎంత నీచత్వము తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా తన ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అని గుర్తుచేసుకొని ఉన్నతన పదవికి న్యాయం ఏం చేయాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com