లింగాల మునేటి వంతెన మీద ఉన్న పైప్ లైన్లను బిగించి వత్సవాయి మండల పరిధిలోని గ్రామాలకు త్వరతిగతిన మంచినీరు అందించాలి : జనసేన బాడిశ మురళీకృష్ణ
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామం మునేటి వంతెనను మరియు వంతెన మీద పగిలిపోయిన మంచి నీళ్ళ పైపులైన్ల ను జనసేన పార్టీ నాయకులు సందర్శించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాన కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకు కూడా లింగాల మునేటి వంతెన దిగువగా ఉండటం వలన వంతెన మీదకు నీరు ప్రవహిస్తుండటంతో వంతెన గుండా వెళ్తున్న నీళ్ల పైపులు దెబ్బతినడంతో మండలంలోని వత్సవాయి, లింగాల,చిట్టేలా, సింగారాం, మక్కపేట,బీమవరం, గంగవల్లి పోచారం, వేములవర్వ, ఇలా పలు గ్రామాల ప్రజలకు మంచినీటి కొరత ఏర్పడటం వలన ప్రజలు మంచినీళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఇలా నెల రోజుల కాలం నుండి మంచినీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అంతేకాకుండా ఇది కరోనా సమయం కావున పక్క ఇళ్లల్లో ఉంటున్న వారిని కూడా గుక్కెడు మంచినీళ్లు అడిగే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ గ్రామాల ప్రజలు మంచినీరు దొరకక అల్లాడిపోతున్నారు కావున తక్షణమే అధికారులు స్పందించి త్వరతిగతిన పైప్లైన్ లు బిగించి మండలంలోని మంచినీటి కొరత ఏర్పడిన గ్రామాలన్నిటికి నీరు అందించాలని అదేవిధంగా మునేటి వంతెనను కూడా ఎత్తుగా నిర్మించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగాల గ్రామం ఎంపీటీసీ అభ్యర్థి రేగండ్ల వెంకటరామయ్య, నండ్రు రాము, అంబాజి గోపి, భూషణం, ఉపేంద్ర, రాంబాబు, చెన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com