• గృహప్రవేశాలు చేస్తున్న టిడ్కో లబ్దిదారులు
• జనసేన పుణ్యమేనంటూ జేజేలు
• సౌకర్యాలు పరిశీలించిన చిలకలూరిపేట నాయకులు
చిలకలూరిపేట, (జనస్వరం) : ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేస్తాం.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం.. అని నిరూపించారు చిలకలూరిపేట జనసేన శ్రేణులు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో టిడ్కో ఇళ్ల సమస్యకు పరిష్కారం చూపగలిగారు. జనసేన పోరాట ఫలంగా టిడ్కో ఇళ్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన లబ్దిదారులు ఒక్కొక్కరుగా గృహ ప్రవేశాలు చేస్తూ జనసేనకు జేజేలు కొడుతున్నారు. టిడ్కో గృహ ప్రవేశాలతో జనసేన ఖాతాలో మరో ప్రజా విజయం చేరిందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పట్టణ పరిధిలో మొత్తం 4,600 మంది లబ్దిదారులకు టిడ్కో గృహ నిర్మాణం చేపట్టారు. అందులో మొదటి విడతగా 2,150 మంది లబ్దిదారులకు కేటాయింపులు ఉంటాయని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన మాటను బుట్టదాఖలు చేసింది. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్థానిక నాయకులు అలుపెరుగని పోరాటం చేశారు. పురసాలక సంఘం అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. దిగివచ్చిన అధికారులు మొదటి విడత ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా లబ్దిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ మొదలు పెట్టారు. మొదట 800 మందికి తాళాలు ఇచ్చిన యంత్రాంగం, ఇప్పుడు మరో 100 మందికి గృహప్రవేశాలు చేసే అవకాశం కల్పించారు. శనివారం పార్టీ నాయకులు పెంటేల బాలాజీ తదితరులు గృహ ప్రవేశాలు చేసిన ఇళ్లలో సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్దిదారులను పలుకరించగా జనసేన పోరాట ఫలంగానే తాము గృహప్రవేశాలు చేయగలిగామని, ఇది ఖచ్చితంగా జనసేన విజయమని కొనియాడారు. జనసేన నేతలు మాట్లాడుతూ లబ్దిదారులకు కేటాయించిన 4,600 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తి చేయించే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన వ్యవహారంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com