ప్రకాశం ( జనస్వరం ) : జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక చింతల వద్ద ఉన్న టిడ్కో గృహాలను జనసేన పార్టీ జిల్లా బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మాట్లాడుతూ 80 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను అధికార వైసీపీ పార్టీ బూత్ బంగ్లాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా వైసిపి ప్రభుత్వం అనర్హులకు ఇచ్చారంటూ ఇప్పటివరకు గృహాలను లబ్ధిదారులకు అందజేయలేదు అన్నారు. నాడు అధికారులకు అర్హులుగా కనిపించిన పేదలు నేడు వారు ఎలా లబ్ధిదారులు కారో చెప్పాలని రియాజ్ డిమాండ్ చేశారు.సొంత ఇంటి కల సాకారం కాక పేదలు ఇ ళ్లలోనే మగ్గుతూ నేటికీ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కేవలం ప్రతిపక్షాలను తిట్టటమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పేదల పట్ల చిత్త శుద్ధి ఉంటే వెంటనే టిడ్కో గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో తామే లబ్ధిదారులకు గృహాలు అందజేస్తామని పేర్కొన్నారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ జన సైనికులు పేదల సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తుంటే వైసీపీ నేతలు సమస్యలు పరిష్కరించకపోగా తిట్లపురాణాలు అందుకోవటం, అరెస్టు చేయటం ,కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చీకటి వంశీ దీప్ మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రతి పేదవాడి సమస్య తీరుస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేనిపక్షంలో రానున్న కాలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదల పక్షాన పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్ మాట్లాడుతూ లబ్ధిదారుల నుండి సేకరించిన సమాచారాన్ని ,వారి సమస్యలను సామాజిక మాధ్యమాలలో పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.