అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గెలుపు మేరకు మొదటి రోజులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బ్రాహ్మణ పల్లి సమీపంలోని జగనన్న కాలనీలో సందర్శిస్తూ జగనన్న మోసాలను బట్టబయలు చేశారు. అనంతరం టీ.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడో కొండల్లో, గుట్టలో పట్టాలు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు ఇసుక తోలిచుకుందాం అంటే అధిక ధరలు అడుగుతుండడంతో ఇసుక కూడా తోలుకోలేని పరిస్థితి ఉందని అప్పులకు వడ్డీలు కట్టుకొలేక ప్రభుత్వానికి డబ్బులు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు 15 లక్షల ఇళ్లను డిసెంబర్ నెలలో ఓపెనింగ్ చేస్తామన్నారు. ఒక్కసారి వచ్చి ఇక్కడి పరిస్థితి చూడమని ఎక్కడో కూర్చుని మాట్లాడకుండా ఒక్కసారి ప్రజా వేదిక మీదికి మీరు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు బహిరంగ సభకు వస్తే చూసుకుంటామని సవాలు విసిరిన జిల్లా నాయకులు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.