పాడేరు ( జనస్వరం ) : పాడేరు జనసేనపార్టీ నాయకులు పాడేరు మండలంలో గలా ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. పాడేరు నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో గల వంజంగి కొండను చేరుకోవాలంటే రహదారి సౌకర్యం బాగున్నప్పటికి జి.మాడుగుల రోడ్డు నుంచి కరకపుట్టు గ్రామ రహదారి మార్గాన పర్యాటకులు వంజంగి కొండను చేరుకోవడానికి సరైన రహదారి లేదని అన్నారు. ఈ రోడ్డు సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పరిస్తే పర్యటకంగా మంచి ఆదాయ వనరుగా జిల్లాకి మంచి ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని జనసేనపార్టీ పాడేరు డా..వంపూరు గంగులయ్య గారన్నారు. అయితే ఇటీవలే కాలం నుంచి కొండను చేరుకోవడానికి చెక్ పోస్ట్ ఏర్పరచడం బాగున్నప్పటికి పర్యాటకుల సందర్శనార్థం టెంట్ కి 50రూపాయల చొప్పున, అలాగే బైక్ కి గతంలో 50 రూపాయల పార్కింగ్ రుసుము చెల్లిస్తే ఇప్పుడు 100రూపాయలు వసూలు చేయడమేమిటో అర్థం కావట్లేదు అలాగే 4 వీలర్స్ కి 200 రూపాయలు వసూలు చేయడం ఒకరకంగా పర్యాటకులను దోచుకోవడమేనని అన్నారు. సరైన సదుపాయాలు కల్పించకపోగా ఈ నిలువు దోపిడేమిటో ప్రజాప్రతినిధులకు నిజంగా తెలియదా? నిజంగానే ఆ నిధులను గ్రామాభివృద్ధికి కేటాయిస్తే సంతోషిస్తామన్నారు. జనసేనపార్టీ పాడేరు సమన్వయ కర్త అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.. గంగులయ్య ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు. పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, కొయ్యురు మండల అధ్యక్షులు గూడెపు లక్ష్మణ్, గూడెం మండల అధ్యక్షులు కొయ్యం బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.