గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగర్ మండల కేంద్రం పార్టీ కార్యాలయం వద్ద జనసేన బిజెపి సంయుక్తంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరుపుకునే పంద్రాగస్టు జనసేనకు ప్రజాసేవ నేర్పిందని, సమాజం పట్ల నాకు కూడా బాధ్యత ఉందనే బాధ్యతను తెలియజేసిందని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, కేంద్రంలో బిజెపి నిస్వార్థ సేవ చేస్తోందనీ కొనియాడారు. దేశం కోసం అసువులు బాసిన మహనీయుల అడుగుజాడల్లో ఈ రెండు పార్టీలు ప్రయాణం చేస్తుందనీ కీర్తించారు. కోట చెరువు గ్రామంలో కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మంచాన పడి ఉన్న బాబు కుటుంబాన్ని పరామర్శించి మూడు వేల రూపాయలు ఆర్ధిక సహాయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కుటుంబంలో బైపీసీ చదువుతున్న అమ్మాయికి పార్టీ ఆధ్వర్యంలో అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్వేటినగరం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటుచేసిన పతాకావిష్కరణకు హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు ఈ విధమైన సేవ చేయడం తన పూర్వజన్మ సుకృత ఫలమని, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని, నిరాడంబరత, నిస్వార్థ సేవా తత్పరత, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి కలిగి ఉన్న, మహనీయుల అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని, ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు, జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు,స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు యువరాజు, టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్సులు నరేష్, వెంకటేష్, మండల కార్యదర్శి ప్రతాప్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మునిరత్నం రెడ్డి, బిజెపి నాయకులు రోహిత్, ఓబీసీ అధ్యక్షులు మధు, యువమోర్చా అధ్యక్షులు గోపి పాల్గొన్నారు.