హుకుంపేట ( జనస్వరం ) : బూర్జ పంచాయతీలోని దిగసల్టాంగి, సొంటారిపాడు, చులిపకోని, కొండైపాడు గ్రామస్తులు రెండు రోజులుగా మజ్జి వలస రేషన్ డిపోకు బియ్యం, నిత్యావసర సరుకులు కోసం మూడు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తున్నారు. అయినా రేషన్ డిపో డీలర్ రావడం లేదు. అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని బూర్జ పంచాయతీ వైస్ సర్పంచ్ సింబోయి పరశురాం అన్నారు. ఈ విషయ౦పై అధికారులు వెంటనే స్పందించి రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని లేని యెడల తహశీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు బొండం పొట్టి బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com