హిందూ దేవాలయాలపై మరియు సాంప్రదాయంపై కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి – జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ కళ్యాణ్
ప్రపంచ దేశాలలో భారతదేశ హిందూ సంప్రదాయాలను ఆచారాలను ఎంతో మంది ఆచరిస్తున్నారు పాటిస్తున్నారు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో కొంతమంది మూర్ఖులు హిందూ దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేకపోతే పిచ్చి పట్టి చేస్తున్నారో తెలియని పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది హిందూ సోదరులారా ఎవరి మతం ఎవరి కులం వారికి ముందు మనం ఏ కులాన్ని మతాన్ని కించపరిచే మాటలు మాట్లాడి తనని పనిగట్టుకుని మరీ రాజకీయ నాయకులు మత విద్వేషాలను రెచ్చ గొడుతూ హిందూ దేవుళ్ల విగ్రహాలకు చేతులు విరిగి పోతే నష్టమా,రథం కాలిపోతే ఏమన్నా మనకు నష్టం వాటిల్లుతుందా అనే వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు బుద్ధి,జ్ఞానం ఏపాటిదో మన ప్రజలకు అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా యువకులంతా ఏకమై ఇటువంటి రాజకీయ నాయకులను ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఎదుర్కొని సరైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఒక భారతదేశ పౌరుడిగా మరియు రైల్వేకోడూరు జనసేన యువ నాయకుడు అంకిపల్లి అఖిల్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.