సత్తెనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్ వెళ్లి కేసులు పెట్టాలని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు నిర్ణయించారు. సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి పట్టణ సిఐ అయిన శోభన్ బాబు గారికి కంప్లైంట్ ను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి మల్లేశ్వరి, సోమిశెట్టి సుబ్రహ్మణ్యం, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచులు అనేష్, శులం రాజ్యలక్ష్మి సిరిగిరి మణికంఠ, కేదారి రమేష్,బత్తిన సుబ్బారావు, రామాంజనేయులు, అంకాల డేవిడ్, తిరుమల శెట్టి సాంబశివరావు,ఎలిశెట్టి రాంగోపాల్ ,కుడితిరి సిసింద్రీ, పాపిశెట్టి రవికుమార్, పోతంశెట్టి వెంకటేష్, సాగర్. పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com