నార్పల ( జనస్వరం ) : మండలంలోని కస్తూర్బాయ్ పాఠశాలలో శ్రీనిధి అనే తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయి.. క్రిస్మస్ సెలవులు సందర్భంగా ఇంటికి వెళ్లి ఈరోజు ఉదయం రావాల్సిన అమ్మాయి ఇంటి నుండి లేటుగా హాస్టల్ కు వచ్చిందన్న కారణంతో, అక్కడ పనిచేస్తున్నటువంటి అకౌంటెంట్ అనిత మరియు జనప్రియ విద్యార్థిని కొట్టి 2గంటల పాటు క్లాసులో పిలుచుకోకుండా బయట నిల్చోబెట్టారు. విద్యార్థి మనస్థాపానికి గురై బాత్రూంలోకి వెళ్లి పినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయిని పరామర్శించి ఈ విషయాన్ని TOSCC మరియు MEO గారి దృష్టికి తీసుకొనిపోయి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన బాద్యులను సస్పెండ్ చేయాలని జనసేనపార్టీ జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జనసేనపార్టీ నాయకులు పెద్దిరాజు మోహన్, జహీర్ తదితరులు కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com