కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గంలోని కరప మండలం ఉప్పలంక గ్రామం లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి పదవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. పారిశుధ్యం లోపించడం వల్ల వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. డ్రైనేజీలు లేకపోవడం వల్ల మురుగు రోడ్డెక్కుతోంది. గ్రామాలు కంపు కొడుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరింత అస్తవ్యస్తంగా మారడం వల్ల ప్రజలు వ్యాదులబారున పడుతున్నారు. ఆధారం లేని మహిళలకు పెన్షన్లు ఇవ్వకుండా ఉన్న పెన్షన్లు కూడా తీసేసి ఇబ్బంది పెడుతున్నారు. మత్స్యకారులకు ఈ వైసిపి ప్రభుత్వం వారికి అందించే పదకాలు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తుంది. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com