రైల్వే కోడూరు ( జనస్వరం ) : అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైన హామీలతో దివాలా తీసిన విధానంతో బే౦బేలెత్తిన వాళ్ళ పార్టీ అధిష్టానం. మా నమ్మకం జగన్ అనే స్టిక్కర్ ప్రతి ఇంటికి తగిలించే ప్రోగ్రాం చేస్తుందని జనసేన నాయకులు అన్నారు. వైసిపి పార్టీ ప్రజా పార్టీ కానందు వల్లే స్టిక్కర్ పార్టీగా మారిందని తెలియజేస్తున్నాము. మొన్నటిదాకా గుడులకు బడులకు రంగులు వేసే ప్రోగ్రామ్ని హైకోర్టు మొట్టికాయలు వేసి ఆపిన ఈరోజు స్టిక్కర్లు వేసే కార్యక్రమానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని రైల్వే కోడూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రజా ఆమోదం కోల్పోయిన ఈ వైసిపి పార్టీ ఇకమీదట అధికార0లో ఉండే హక్కు లేదని తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజాక్షేత్రంలో స్టిక్కర్ పార్టీలకు స్థానం లేదని జనసేన ప్రభుత్వం లోకి రాగానే ప్రజా ప్రభుత్వంగా పరిపాలన అందిస్తామని కావున ప్రతి ఒక్కరు జనసేనకు అండగా నిలవాలని పిలుపునిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.కార్యక్రమంలో మర్రి రెడ్డి ప్రసాద్, ఉత్తరాది శివకుమార్, వర్ధన గారి ప్రసాద్, ముత్యాల కిషోర్, అంకి శెట్టి మని, కొండేటి వెంకటరమణ, దళిత నాయకులు నగిరిపాటి మహేష్, కుప్పాల ధనుంజయ, గిరిధర్, రవిశంకర్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com