పెద్దకడబురు, జనస్వరం న్యూస్(అక్టోబర్06): గంగులపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామసభలో గురువారం ప్రతిపక్ష నాయకులకు సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు, వైస్ సర్పంచ్, వార్డ్ మెంబెర్స్ కు తెలియకుండా, కనీస ప్రోటోకాల్ పాటించాకుండా, గ్రామ పంచాయతీ సెక్రటరీ, టెక్నిలాల్ అసిట్టంట్, గ్రామ సర్పంచ్, వలెంటర్లు మాత్రమే స్కూల్ నందు తలుపులు వేసుకొని గ్రామ సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని టిడిపి మంత్రాలయం లీగల్ సెల్ సభ్యులు బాబురావు అన్నారు. గ్రామస్తులకు తెలియకుండా గ్రామ సభ నిర్వహించడం సబబు కాదని, అధికార పార్టీ నాయకులకు అధికారులకు కనీస ప్రోటోకాల్ తెలియదా అని ప్రజలు అడిగే సమస్యలకు జవాబు చెప్పలేక గ్రామ సభ నిర్వహిస్తున్నారని అన్నారు. స్కూల్ నందు తలుపులు వేసుకొని గ్రామ సభ జరుపుకోవడం ఎంటని ప్రశ్నించారు, గ్రామ సభలో ఎప్పుడు ఎలా నిర్వహించాలో కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. గ్రామంలోని సమస్యలు పరిష్కారం కోసం గ్రామ సభ ఏర్పాటు చేయగలరని వైసీపీ పార్టీ అధికారం నాయకులు సమావేశం ఇవ్వడం కాదని అన్నారు. ఇది గ్రామసభ కాదని, వైసిపి పార్టీ సభ అని అన్నారు. గ్రామస్తులు లేకుండా గ్రామ సభలో ఎలా నిర్వహిస్తారని గ్రామప్రజలు, టీడీపీ పార్టీ, వైస్ సర్పంచ్, వార్డ్ మెంబెర్స్ అందరు కలసి పంచాయతీ కార్యదర్శి ని నిలదీశారు. ఈ విషయంపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని పత్రిక ముఖంగా కోరారు.