Logo
Date of Publish : 25 September 2020, 1:58 pm
Editor : Sake Naresh

పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై పన్నులు తగ్గించాలి అంటూ నిరసన చేపట్టిన జగ్గయ్యపేట జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై పన్నులు తగ్గించాలి అంటూ నిరసన చేపట్టిన జగ్గయ్యపేట జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

                 ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక డిపో సెంటర్ నందు ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఇంధనాల పై విధించే పన్నును 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచడంతో ఇంధన ధరలు భారీగా పెంచి సామాన్యుని నడ్డి విరిచింది అని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరువున నిరసన కార్యక్రమం చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ మన ప్రక్కనే ఉన్న తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కన్నా లీటరుకు 4 రూపాయలు ఎక్కువగా ఉండటం దారుణమనీ, ఇటీవల కరోనా కాలంలో ప్రజలు సరైన ఉపాధిలేక పోవడంవల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతూ జీవనోపాధి కోసం చిరువ్యాపారులు వీలైనంత వరకు మోటారు సైకిళ్లమీదే ప్రయాణం చేస్తున్నారనీ, పట్టణాల్లోనే కాక గ్రామాల్లో పాలు, పండ్లు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, టూ వీలర్స్, ఆటోలపై సరుకులు తెచ్చుకునే వాళ్ళు పెరిగిన ఈ పెట్రోల్ ధరలకు వాళ్ల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇక నేచురల్ గ్యాస్ కింద లభ్యమయ్యే సి.ఎన్.జి గ్యాస్ ఆటోలకు, బస్సులకు వాడటం వల్ల వాటిమీద పెరిగిన పన్నుల వల్ల కూడా ప్రజలకు పరోక్షభారం పడింది కాబట్టీ ప్రభుత్వం వెంటనే ఈ పన్నును తగ్గించాలని జనసేన పార్టీ తరువున ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రస్తుత పాలక ప్రభుత్వం ప్రజలకు అర్థం కాని రీతిలో కొత్త కొత్త పన్నులు వేయడం, స్లాబులలో మార్పులు చేసి కరెంటు చార్జీలను విపరీతంగా పెంచడం, ఆరోగ్య రక్షణ బాధ్యత తీసుకోకుండా కరోనా సమయంలో మద్యం షాపులు తెరవడం, తమ పాలనలో మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తామని చెబుతూ కొత్తగా బార్లకు లైసెన్స్ రెన్యువల్ చేయడం కేవలం సామాన్యుడి బలహీనతలపై వ్యాపారం చేస్తూ ప్రభుత్వం తన ఖజానాను నింపుకుంటూన్నట్టుగా కనిపిస్తోంది అని, సంక్షేమ పథకాల పేరుతో పై జేబులో 10 రూపాయలు పెట్టి కింద జేబులో నుంచి 100 రూపాయలు లాక్కునే ప్రయత్నాన్ని జనసేనపార్టీ పూర్తిగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, రెహ్మాన్, మహేష్, సోహైల్, రాం, మహేష్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com