Logo
Date of Publish : 14 February 2023, 2:17 pm
Editor : Sake Naresh

రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం ఇది

• మిల్లర్లకు తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తున్నారు
• ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై జనసేన మండిపాటు
• రైతులతో కలసి కోరుకొండ తహసీల్దార్ కార్యాలయానికి బత్తుల బలరామకృష్ణ
      రాజానగరం, (జనస్వరం) : రైతు ప్రభుత్వమని డప్పు కొట్టుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తూట్లు పొడుస్తుందని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా తయారయ్యిందని, పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొరుకొండ మండల పరిధిలోని కాపవరం తదితర గ్రామాల రైతులతో కలసి  బత్తుల బలరామకృష్ణ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రైతుల సమస్యలు తహసీల్దార్ కు వివరించారు. నెల రోజులుగా రైతులకు కనీసం గోని సంచులు కూడా దొరకడం లేదని, తక్షణం గోనె సంచులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర రైతులకు దక్కేలా చూడాలని, రైతుల ఖాతాల్లో సాధ్యమైనంత త్వరగా డబ్బు జమ అయ్యేలా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు గడువును మరింత పెంచాలన్నారు. ధాన్యం రవాణా ఖర్చులు అంటూ బస్తాకు రూ. 200 బారం రైతుల మీద మోపడం దురదృష్కరమన్నారు. ప్రభుత్వం మిల్లర్లకు తలొగ్గి రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో నియోజకవర్గ స్థాయిలో రైతులతో కలసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను వైసీపీ కాలరాస్తోందని మండిపడ్డారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో జనసేన పార్టీ రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com