నెల్లూరు ( జనస్వరం ) : ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం భైరవవరం గ్రామంలో దాదాపు 100 ఎకరాలు కొంత అసైన్డ్టు భూమి, కొంత సొంత భూమి కలిగి దానిపై ఆధారపడి గత 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న డెబ్భై కుటుంబాలకు చెందిన పొలాలకు ఎటువంటి నోటీసు లేకుండా గత ఐదు నెలలుగా రిజర్వాయర్ పనులు ప్రారంభించింది ప్రభుత్వం. వారందరినీ ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయమై తమ వద్ద ఉన్న కాగితాలు మొదలగు వాటిలో పలుమార్లు ఎమ్మార్వో గారిని ఆర్ డి ఓ గారిని కలవడం జరిగిందని రైతులు వాపోయారు. వారు ప్రత్నామ్యాయం చూపటంలో విఫలమయ్యారు. ఇప్పుడు వారందరూ వీధిన పడాల్సిన పరిస్థితి వవచ్చింది. కావున వీరందరూ జనసేన పార్టీ నాయకులను కలసి తమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వంతో పోరాడాలని కోరుతూ, జిల్లా కలెక్టర్ ను కలిశారు.