
జనసేన పార్టీలో చేరిన తిమ్మాపురం గ్రామ యువకులు & ఫోటో గ్రాఫర్లు : ఎమ్మిగనూరు నియోజకవర్గం
జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంఛార్జి రేఖగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పార్టీ కార్యాలయంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన 20 మంది యువకులు ఎమ్మిగనూరు పట్టణ ఫోటోగ్రాఫర్లు 5 గురు జనసేన పార్టీ లో చేరారు. అనంతరం ఎమ్మిగనూరు సోషల్ మీడియా కమిటీ ప్రతినిధిగా జి.ఉపేంద్ర, ప్రసాద్, గోనెగండ్ల సోషల్ మీడియా ప్రతినిధిగా పవన్ కుమార్ లను ఎన్నుకున్నారు. పార్టీ ఇంఛార్జి రేఖగౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ పటిష్టం చేయుటకు ప్రతి జనసేన కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.
కోవిడ్ సమస్యలు తగ్గుముఖం పట్టగానే సమస్యలున్న ప్రతి చోట పర్యటిస్తానని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం పనిచేసే సైనికులు అడుగడుగునా ఉన్నారని అందరు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. అభిమానులమని చెప్పుకొని పార్టీ ప్రతిష్టను దెబ్బతీయలని పార్టీకి సంబంధం లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే అటువంటి వారికి క్రమశిక్షణ పరంగా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత స్వలాభల కోసం పనిచేసే వారికి పార్టీలో స్థానం ఉండదని పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తని గుర్తించి పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, మండల ఇంఛార్జి కమిటీలను 10 రోజుల్లో పూర్తి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంఛార్జి బాషా, నాయకులు గాజుల వెంకటేష్, రాహుల్ సాగర్, బజారి, షబ్బీర్, వీరమహిళ, కృష్ణవేణి, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు రవిప్రకాష్, తిమ్మాపురం యువకులు అంపన్న, నాగరాజు, వెంకటేష్, నాగేష్, రంగన్న, రాజు, శ్రీరాములు, చిన్నబాలు తదితరులు పాల్గొన్నారు.