
రైల్వేకోడూరు, (జనస్వరం) : రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించేందుకు అధికార విపక్షాలు కేసినో సమస్యను ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయని జనసేన పార్టీ రైల్వేకోడూరు నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు విమర్శించారు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలను కరోనా జాగ్రత్తలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీలు దూషణ భూషణాలతో ఒకరినొకరు సత్కరించుకొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటన్నిటిని విస్మరించి కేసులు, తిట్టుకోవడం ఎక్కువైపోయింది అని ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజల సమస్యలను సామరస్యంగా పరిష్కరించి ప్రభుత్వాన్ని సజావుగా నడిపే జనసేన పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, రెడ్డి మనీ, కిషోర్, యశ్వంత్, చెంగల్రాయుడు ఆచారి, కొండేటి భాస్కర్, అల్లం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.