విజయనగరం ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారిని సన్నాసి అన్నా నువ్వు నీకన్నా ఈ ఉత్తరాంధ్రలో సన్నాసి ఎవడు బొత్స అంటూ జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు అన్నారు. 30 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొత్స, ధర్మాన, గుడివాడ కుటుంబాలు ఉత్తరాంద్రాన్ని ఎలా ఉద్ధరించారో చెప్పాలి ? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలి? ఎంతమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి ? ఇప్పుడు ఉత్తరాంధ్ర పై ముసల కన్నీళ్లు పెడుతున్నారు. ఉత్తరాంధ్ర కావాలని ఒకడు ఉద్యమం చేస్తానంటాడు ఇంకొకడు ప్రత్యేక పార్టీ పెడతానంటారు. ఇంకొకడు ఐటి మినిస్టర్ గా ఉంటూ దావోసు నుండి ఐటీ మేనేజ్మెంట్ ని ఉత్తరాంధ్రకే తీసుకొస్తానంటాడు. ఇలా ఉత్తరాంధ్ర ప్రజల్ని రాయలసీమ ప్రజల్ని మోసగిస్తూ తమ పద్దాలు గడుపుకుంటున్న కొందరు స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు అందులో మొదటి వరుసలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరు ఇతను ఎన్ని పార్టీలు మారడో అతనికే తెలియదు ఛిత్త శుద్ధి లేని నాయకుడని అన్నారు. ప్రజలని రాష్ట్రాలని దేశాలని విభజించి పాలించడం బ్రిటిష్ వాళ్ళకే సాధ్యం అనుకున్నాం కానీ వాళ్ళని మించిపోయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు తయారవడం జరిగింది. మూడుసార్లుగా మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ తన నియోజకవర్గాన్నే ఉద్ధరించలేని నాయకుడు ఉత్తరాంధ్ర నే ఉద్దరిస్తాడట అని హేళన చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి నడిబొడ్డులో ఉన్నటువంటి దళితుల sc స్మశానాన్ని ఐఎంజి జగనన్న ఇల్లు కాలనీలకి కేటాయించడంలోనే బొత్స సత్యనారాయణ గారి యొక్క రాజకీయం ఈ నియోజకవర్గ దళితులకు అర్థమవుతుంది. మెరకముడిదాం మండలం మెరక ముడిదాం గ్రామంలో దళితులకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 450 కుటుంబాలకు ప్రత్యేక స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఎన్నో ధర్నాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చిన స్పందించలేని మంత్రి బొత్స సత్యనారాయణ, స్పందించలేని మెరకముడుదాం మండల జడ్పిటిసి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను వీళ్ళ ఉత్తరాంధ్ర ని ఉద్ధరించేదని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com