విశాఖపట్నం ( జనస్వరం ) : వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ, వందల కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సవాళ్లను స్వీకరించడానికి సిద్ధమని మరోమారు స్పష్టం చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం చౌడపల్లి, ఒంగోలు కు ఆనుకుని ఉన్న వెంగముక్కలపాలెం శ్రీకర డెవలపర్స్ లేఅవుట్, బాలినేని వియ్యంకుడైన భాస్కర్ రెడ్డి స్వగ్రామమైన జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామ పరిసరాల్లో కబ్జాలపై ఇప్పటికైనా నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పెద్దలను బ్లాక్ మెయిల్ చేయడం, ఫిర్యాదుదారులను బెదిరించటం, నియోజకవర్గంలో సానుభూతి మాటలు మానేసి ఆరోపణలపై నిజాయితీగా విచారణ కోరాలి.
ప్రకాశం జిల్లాలో కుండా భాస్కర్ రెడ్డి కబ్జా ఖాతాలో మరో 160 ఎకరాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో కుండా భాస్కర్ రెడ్డి , ఆయన బినామీల పేరిట 140 ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. 140 ఎకరాలకే పట్టాలు ఉండగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణం లో రొయ్యల సాగు జరుగుతోంది. భాస్కర్ రెడ్డి స్వగ్రామమైన కే బిట్రగుంటకు సమీపం లోని ఈ భూములను విభజించి ఆయన ఎకరాకు సంవత్సరానికి 60 వేల రూపాయలు చొప్పున లీజులకు ఇచ్చారు. పట్టా పొందిన భూమి 140 ఎకరాలు కాగా ఆయన లీజులకు ఇచ్చిన భూమి విస్తరణ 300 ఎకరాలు. పాకల గ్రామ సర్వేనెంబర్ 213 నుంచి 220 వరకు, 323 నుంచి 344 వరకు ఈ భూములు ఉన్నాయి పాకల గ్రామంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ ఖాళీ స్థలాలు చెరువులు కాలువలు ఉన్నాయి. వీటన్నింటినీ భాస్కర్ రెడ్డి తన రొయ్యల చెరువుల్లో కలిపేసుకుని అక్రమంగా లీజు లకు ఇచ్చేశారు. తన పైన తన బంధువుల పైన కబ్జా ఆరోపణలు నిరూపించాలని సవాలు విసురుతున్న బాలినేని పాకల రొయ్యల చెరువులపై బహిరంగ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నాం. ఇందులోని పట్టా భూముల్లో కూడా పలు అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా ఇందులో కొంత భాగం భూములకు లేని పట్టాలు బాలినేని 2019లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే రాజకీయ ఒత్తిడితో పుట్టుకొచ్చాయి. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
వెంగముక్కలపాలెం అక్రమాలు నిజం కాదా..? విచారణకు బాలినేని సిద్ధమా?
ఒంగోలు నగర శివారులోని వెంగముక్కలపాలెంలో బాలినేని బినామీ భాస్కర్ రెడ్డి వేసిన 40 ఎకరాల శ్రీకర ఎంపైర్ లేఔట్ లో అక్రమాలపై బాలినేని నోరు విప్పక పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులోని 30 సెంటుల చెరువు భూమిని, పల్లంలో వున్న మొత్తం లేఔట్ ను ఎర్రజర్ల, సర్వే రెడ్డి పాలెం గ్రామాల నుంచి అక్రమంగా రెండు లక్షల యూనిట్ల మట్టిని తవ్వుకు వచ్చి నింపిన మాట నిజం కాదా.? ప్రభుత్వానికి కేవలం పది లక్షల రూపాయలు చెల్లించి 30 కోట్ల రూపాయల మట్టిని తరలించడంపై విచారణకు సిద్ధమా . ? ఇదే లేఔట్ లో కాంపౌండ్ వాల్ నిర్మించిన స్థలం ఆర్ అండ్ బి దీ, నీటిపారుదల శాఖకు చెందినదని స్థానికులు మార్చి 27వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఒంగోలు జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న ఈ లేఔట్ లో 5 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని, విచారణకు సిద్ధమని మరో మారు స్పష్టం చేస్తున్నాం.
గ్రానైట్ డంపులు స్వాధీనం చేసుకోలేదా?
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సుమారు డజను గ్రానైట్ క్వారీల డంపులను స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బ్లాక్ గాలక్సీ గ్రానైట్ కి పేరు మోసిన ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీ ల యజమానులను బెదిరించి, విజిలెన్స్ తో దాడులు చేయిస్తామని భయపెట్టి బాలినేని స్వాధీనం చేసుకున్నారని, ఆయన అనుచరుల వాటిని నిర్వహిస్తున్నారని స్పష్టం చేస్తున్నాం. వీటిలో వచ్చే వ్యర్ధాలు అన్నింటిని డంపుగా వేసి వ్యాపారుల తర్వాత వాటిని అమ్ముకుంటారు. బాలినేని వారిని బెదిరించి ఆ డంపులను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నాం.
వీటితోపాటు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం చౌడపల్లి లో కుండా భాస్కర్ రెడ్డి వేసిన లేఔట్ లో 25 ఎకరాల ప్రభుత్వ అటవీ శాఖ భూములు కబ్జా అయ్యాయని సర్వే నెంబర్లతో సహా విశాఖలోవి విఎంఆర్డీఏ కమీషనర్ కు, ఫారెస్ట్ అధికారులకు నెలరోజుల క్రితం ఫిర్యాదు చేసిన జాయింట్ సర్వే కు వారెవరు సిద్ధం కాలేదు. బాలినేని రాజకీయ ఒత్తిడితోనే సర్వే ను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క విచారణకు రాకుండా అధికారం అడ్డుకుంటూ మరోపక్క బెదిరింపులకు, సానుభూతికి ప్రయత్నించడం ఏమి రాజకీయమో అర్థం చేసుకోవాలి.
నరసరావుపేట ఫార్మా పైనా విచారణ జరపాలి
తీవ్రవాదుల కు నిషేధిత మందులు సరఫరా చేసి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ను ఎదుర్కొంటున్న సేఫ్ ఫార్మా వ్యవహారాలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన బినామీల ప్రమేయం పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బాలినేని సంబంధిత శాఖల మంత్రిగా వున్న సమయంలోనే ఈ కంపెనీ యాజమాన్యం మారింది. ప్రకాశం జిల్లా కు చెందిన బాలినేని అనుయాయుల చేతికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.
బాలినేని ఆయన బినామీ అయిన కుండా భాస్కర్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు లొంగకుండా వీరి అక్రమాలపై విచారణ జరిపి మీరు కబ్జాలోని ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అక్రమ మైనింగ్ పై చట్ట ప్రకారం అపరాధరసులు విధించి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.