Logo
Date of Publish : 25 August 2023, 9:52 pm
Editor : Sake Naresh

పోరాడితే పోయేదేం లేదురా.. ఎదవ బానిస సంకెళ్లు తప్ప..

          అభిమానం.. ఆపితే ఆగేది కాదు. ముఖ్యంగా సినిమా హీరోల మీద అభిమానులకు ఉన్న అభిమానం మాములుగా ఉండదు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. వారికి పండుగ మొదలైనట్లే. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే.. అభిమానులు కాదు భక్తులే.. పండుగ కాదు ఏకంగా జాతరనే చేస్తారు. ఇప్పటికే ఆ జాతర మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే కార్నివాల్ అంటూ సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తున్నారు. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు.. అన్నదానాలు.. రక్తదానాలు.. ఇలా ప్లాన్ చేసేస్తున్నారు. ఇక ఇంకోపక్క అభిమానులు.. పవన్ కొత్త సినిమాల అప్డేట్స్ వస్తాయని ఎదురుచూస్తున్నారు. 

    ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సీడీపీ ప్రోమోను రిలీజ్ చేశారు. సీడీపీ అంటే.. కామన్ డిస్ప్లే పిక్. పవన్ పుట్టినరోజున అందరూ ఈ ఫోటోనే షేర్ చేస్తారు. ఎప్పుడు పవన్ ఫొటోతోనే ఉండే సీడీపీకి ఈసారి కొద్దిగా పొలిటికల్ టచ్ ఇచ్చారు. సీడీపీ ప్రోమో వీడియోలో.. జనసేనాని పవన్ నినాదాన్ని వినిపించారు. ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో అంటూ రాసి ఉంది. ఇక చివరిలో పోరాడితే పోయేదేం లేదురా ఎదవ బానిస సంకెళ్లు తప్ప అనే పవన్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఇక బర్త్ డే సీడీపీ ని ఆగస్టు 27 న పవన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com