నెల్లూరు ( జనస్వరం ) : విశాఖ ముఖ్య నాయకుడు ముక్కా శ్రీనివాస్ తిరుపతి ప్రయాణంలో భాగంగా ఆదివారం సాయంత్రం సంతపేట, నెల్లూరు సిటీ నందు పవన్ కళ్యాణ్ గారికి రైతు భరోసా యాత్రకు తమ వంతు సహాయం అందజేసిన చిన్నారులనూ, జనసేన కార్యకర్త సుబ్బును అభినందించేందుకు వారి నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా ఆహ్వానం మేరకు గునుకుల కిషోర్ నెల్లూరు సిటీ జన సైనికులతో వారిని నెల్లూరుకు స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలకు కాలం చెల్లిందనీ,జనసైనికులను బెదిరించినా అక్రమ కేసులు బనాయించాలని చూసినా సహించేది లేదనీ రానున్నది జనసేన ప్రభుత్వం అని కేసులకు భయపడే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆవేశ పడవద్దు,కొంత తగ్గి ఉండమని ఆదేశాల మేరకే మేము చాలా నియంత్రంణ తో వ్యవహరిస్తున్నామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు గునుకుల కిషోర్ మాట్లాడుతూ.... సామాన్య కార్యకర్తలను కార్యకర్త లతో కలిసిపోయే తమ జనసేన నాయకులను గెలిపిస్తే రానున్న రోజులతో ప్రజల సంక్షేమానికి పాటుపడతారని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బాట లో ప్రయాణిస్తున్న జనసేన నాయకులందరూ సామాజిక బాధ్యత కలవాలని సమసమాజ స్థాపనకు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి గాజు గ్లాసుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం స్థానిక జనసైనికులతో గాజు గ్లాస్ తో టీ సేవించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు ముక్కా శ్రీనివాస్ గారు, గునుకుల కిషోర్, సుబ్బు, ప్రశాంత్ గౌడ్, కంథర్, అలేఖ్, అమీన్, హరి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com