జగ్గంపేట ( జనస్వరం ) : రాష్ట్ర ప్రజలందరీ శ్రేయస్సు కోరే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణ సరికాదని ఖండించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని ప్రజలందరికీ తల్లి, తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం గురించి, రైతుల ఇబ్బందుల గురించి, యువత ఉపాధి కల్పన గురించి, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి గురించి ఆలోచించి అందుకు తగిన చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే ఆలోచన చెయ్యాలి కానీ, ఎంతసేపు ప్రజల పక్షాన ఉండే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు చెయ్యడం తప్ప వేరే ఏమీ చెయ్యడం చేతకాదని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో ఏర్పాటు చేసిన సామూహిక గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పని మీద మాట్లాడాలి తప్ప ఎంతో ప్రజాధనం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సభలో అసలు విషయం వదిలేసి ఎవరిని ఏమి కేసులలో ఇరికించాలని, ప్రజల పక్షాన పోరాడే నాయకులను ఎలా నిందించాలి అనే వాటిపైన ఆయన దృష్టి పెడుతున్నారు అని అన్నారు. నేడు మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద ప్రజలందరూ గర్వించదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి కూడా రాష్ట్రంలోని ఎంతో మంది ప్రజల కోసం, రైతన్నల కోసం, కష్టాలలో ఉన్న వారి కోసం ఖర్చుపెడుతున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఏమి చెయ్యాలో అర్ధంకాక ఆయన ఎక్కడ సభ ఏర్పాటు చేసిన అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప మరేమీ చెయ్యలేని దుస్థితిలో ఉన్నారన్నారు. రైతన్నకు సాగునీరు లేక, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు లేక, గృహ నిర్మాణాలు లేక, రోడ్లు బాగోలేక, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, ఉద్యోగులకు జీతాలు లేక, పేదలకు ఉపాధి లేక ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు కృషి చేయాలన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com