Logo
Date of Publish : 13 September 2022, 4:21 pm
Editor : Sake Naresh

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ : విజయవాడ పశ్చిమ జనసేన నాయకులు

           విజయవాడ, (జనస్వరం) : ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని ఓడిపోయే ప్రభుత్వానికి ప్రకటించే పథకాలు ఎక్కువ అని విజయవాడ జనసేన నాయకులు అన్నారు. పెళ్లి కానుక ఇవ్వటానికి పదో తరగతి షరతులు పెట్టడం మరొక్కసారి సీఎం జగన్ ముస్లిం మైనార్టీల ఆడపిల్లలకు చేస్తున్న పచ్చి మోసం అని అన్నారు. జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా మాట్లాడుతూ వైయస్సార్ దుల్హన్ పథకం పేరుని షాది తోఫా దుల్హన్ అనే పేరు మార్చి దుల్హన్ అంటే పెళ్లికూతురు ఆడపిల్ల పేరు మీద ఉన్న దుల్హన్ పథకాన్ని పేరు మార్చి షాది తోఫా అనే పేరు పెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిపై నిబంధనలు అమలు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ముస్లిం మైనార్టీ ఆడపిల్లలు అంటే జగన్ కి అంత చులకన ఎందుకు అని, సీఎం జగన్ కి ముస్లిం మైనార్టీల గురించి కనీసం అవగాహన ఉందా అని, ముస్లిం మైనార్టీల స్థితిగతులు నిరక్షరాస్యత ముస్లిం మైనార్టీల పేదరికం అన్నీ కూడా పార్లమెంట్లో సమర్పిస్తే ముస్లిం మైనార్టీల పిల్లల పెళ్లిళ్లకు పదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. ఈ పథకంలో పెట్టిన షరతులు చూస్తుంటే ముస్లిం మైనార్టీ ఆడపిల్లల పైన వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఏంటి దుల్హన్ పథకం కింద ప్రతి మైనారిటీ ఆడపిల్లలకు లక్ష రూపాయలు పెళ్ళికానుక ఇస్తానన్నారని, కానీ ఈ మూడున్నర సంవత్సరాలలో ఎంతమంది ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లందర్నీ మోసం చేసినట్టు కాదా?అని, పెళ్ళికానుక పథకం అమలు చేస్తే ఈ మూడున్నర సంవత్సరాలలో ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని, అప్పుడే ఆ పథకం అమలు చేసినట్టు అవుతుందనీ, పథకాలు పెట్టాలి కానీ లబ్ధిదారులు తక్కువగా ఉండాలి అనే భావనతో ఉంటే ఇలాంటి కండిషన్స్ పెట్టి ప్రజలను మోసం చేయొచ్చు ఆలోచనలు ఉన్నారని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల కోసం ప్రకటన చేసినట్లు ఉంది. ఈ షాదీ తోఫా పథకం అని ,పశ్చిమ నియోజకవర్గంలోనే హాస్ హౌస్ నిర్మాణం చేయాలని, షాదీ ఖానా సీఎంచే ప్రారంభించిన ఇప్పటికే కబరిస్తాం లాగే ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి మైనారిటీల పైన నిజంగా చెత్తశుద్ధి ఉంటే షాది ఖానా సామాన్య ముస్లింలకు 5000 అద్దెకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన యువనాయకులు హనుమాన్ , పోలిశెట్టి శివ బుద్దన ప్రసాద్, నాగరాజు, సాంబ, నవీన్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com