ఈ ప్రభుత్వంలో ఆలయాల ఆస్తులకు రక్షణ కరువు.
- కోర్టు తీర్పులను ధిక్కరిస్తారా ?
- దోపిడిపై బెజవాడ బ్రదర్స్ నోరు విప్పాలి
- దోపిడిలో దేవాలయ శాఖ ఉన్నతాధికారులకు భాగస్వామ్యం ఉందా ?
- ఈ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందా ?
విజయవాడ ( జనస్వరం ) : ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన మహేష్ గారు ఆరోపించారు. అలాగే దేవాలయ ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అలాగే, భూముల అన్యాక్రాంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకపరిధిలో ఉన్న కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆస్తిపై ఎప్పటినుంచో వివాదాలు నడుస్తున్నాయన్నారు. వంశపారపర్య ధర్మకర్తలుగా చెప్పుకుంటున్న కొందరు ఇదే మాదే అంటూ ప్రజల్లో సైతం అవాస్తవాలు కల్పిస్తున్నారని చెప్పారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన 600 గజాల విలువైన స్థలాన్ని, దాన్ని ఆనుకొని ఉన్న సీతారామస్వామి సత్రానికి చెందిన 300 గజాల స్థలాన్ని పి. చంద్రశేఖర్ పురుషోత్తమ శర్మ అనే వ్యక్తులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చేసుకున్నా అప్పీల్ ను న్యాయస్థానం కొట్టేసిందని, ఆ స్థలం దేవాదాయ శాఖదే అని తీర్పుని ఇవ్వగా, మళ్ళీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ కూడా ఈ ఇద్దరి వ్యక్తులకు నిరాశ ఎదురైందని చెప్పారు. ఆ స్థలాన్ని బెజవాడ బ్రదర్స్ శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకునేందుకు చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారాలపై బెజవాడ బ్రదర్స్ కు అడ్డు అదుపు లేకుండా అవినీతి చేయాలి అనుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు అన్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్వీ ప్రసాద్ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేశారని, మంత్రి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తారా అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి వంశీ, లకనం శ్యామ్ ప్రసాద్, యస్ కృష్ణ ప్రసాద్, పిల్ల శ్రీనివాస్, ఆర్.ఆర్ రాజు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.