గుంటూరు ( జనస్వరం ) : వైసీపీ నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో సైతం అగ్రహజ్వాలాలు పెల్లుబికుతున్నాయని, వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 55 డివిజన్ అధ్యక్షుడు కొనిదేటి కిషోర్ ఆధ్వర్యంలో డొంకరోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి అయ్యారు. స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు ముస్తఫాకి పదేళ్లు శాసనసభ్యుడిగా అధికారం ఇచ్చినా కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేకపోయాడని విమర్శించారు. కనీసం ప్రజలకి తాగేందుకు రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. డయేరియాతో ఇప్పటివరకు ముగ్గురు మృత్యువాత పడితే ముస్తఫా ఎక్కడ దాక్కున్నాడని మండిపడ్డారు. రకరకాల డ్రామాలాడుతూ నటనలో కమల్ హాసన్ ని మించిపోయాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయని ప్రజలెవరూ కూడా ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు రానున్నాయని. మంచి పాలకులను ఎన్నుకోవాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ల హరి, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com