Logo
Date of Publish : 06 January 2023, 2:57 am
Editor : Sake Naresh

కాలువలలో కూడా పూడిక తీయించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం

• పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 234వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ రాయపాలెం సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. కాలువలు పూడికతీతకు నోచుకోక దుర్గంధం వెదజల్లుతున్నాయని అన్నారు. ఇటీవల ఇక్కడ అనేకమంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని దీనికి ఈ కాలువల పూడికతీత అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ఇంటింటికీ చెత్త పన్ను విధిస్తున్న జగన్ ప్రభుత్వం ప్రజల జీవితాలను చెత్తమయం చేస్తోందని విమర్శించారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నగరాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, ప్రజలందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలవబోయేది తామేనని, గెలిచి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com