● హిందువుల ప్రధాన పండుగల్లో దసరా ముఖ్యమైనది.
● సాధారణంగా గ్రేడ్ 4 ఉద్యోగులు దసరా పండుగ బోనస్ ని ప్రభుత్వం నుండి ఆశిస్తారు.
● కానీ వైసీపీ ప్రభుత్వంలో జీతంకూడా పడకపోవడంలో కొత్తబట్టలు కూడా కొనలేని స్థితిలో పండుగ ఆనందాలకు దూరమవుతున్నారు.
● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 141వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని గోపీ టీ సెంటర్ డౌన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా దసరా పండుగ అంటే ప్రభుత్వ శాఖల్లో పని చేసే గ్రేడ్ 4 ఉద్యోగులు పండుగ బోనస్ కోసం చూస్తారని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జీతం కోసం ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేతంరెడ్డి దుయ్యబట్టారు. అక్టోబర్ 5 న దసరా పండుగ అయితే అక్టోబర్ 1 నుండి 4 తేదీల లోపు జీతాలు పడతాయని ఉద్యోగులు భావించారని, కానీ ఇప్పటికి కూడా ఆ ఊసే లేదని, ఉద్యోగులు జీతం పడిందనే మెసేజ్ కోసం తమ సెల్ ఫోన్ లను కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారని అన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా తయారైందని అన్నారు. హిందువుల ప్రధాన పండుగల్లో దసరా ఒకటని, ఇంటిళ్ళపాది కొత్త బట్టలు కొనుక్కుని ఆనందంగా జరుపుకునే వేడుక అని, కానీ ఈ అసమర్ధ వైసీపీ ప్రభుత్వం కారణంగా ఆ ఆనందాలు అనేక ఇళ్ళలో దూరమవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ప్రజలందరూ ప్రభుత్వ మార్పు కోసం చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండేలా పాలనా విధానం ఉంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com