●30వ రోజు పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వట్రపాలెంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామమాత్రపు సిమెంట్ రోడ్లు కాలువలు కట్టించి ప్రజల ప్రాణాలతో ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. అంతర్గత రోడ్లు వేయకుండా, వర్షపు నీరు కానీ డ్రైనేజీ నీరు కానీ బయటకు వెళ్లడానికి వీలులేకుండా చేశారని, అర కొర పనులతో వట్రపాలెం ప్రజల్ని అధికార పార్టీ మోసం చేస్తోందని ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. బురదమయమైన రోడ్లు, డ్రైనేజీ నీరు, పేరుకు పోయిన చెత్త మధ్యలోనే మేము జీవనం సాగిస్తున్నాము, చిన్న పెద్ద అందరం తరచుగా జబ్బుల బారిన పడుతున్నాం అని, మమల్ని ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు అని స్థానిక ప్రజలు ఉయ్యాల ప్రవీణ్ ముందు ఆవేదన వ్యక్తం చేసారు. మా ప్రాతానికి వార్డ్ మెంబర్ ఎవరో కూడా మాకు తెలియదు అని ఇక్కడి ప్రజలు ఉయ్యాల ప్రవీణ్ తో తెలిపారు. అంగన్ వాడి కేంద్రం భవనం కూడా శిధిలావస్తలో డ్రైనేజి నీల మధ్యలో ఉందని స్థానికులు తెలిపారు. అర్హులకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయకుండా అధికార పార్టీ అండ ఉండి సొంత ఇల్లు ఉన్నవారికి కూడా ప్రభుత్వ సహాయం అందుతోందని ఈ ప్రాంత వాసులు ప్రవీణ్ కి తెలియజేసారు. ఎన్ని పార్టీ లు అధికారంలోకి వచ్చిన వట్రపాలెం ప్రజల జీవితాల్లో మార్పు రాకపోగా రోజు రోజుకి దయనీయంగా మారుతోందని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వట్రపాలెం ప్రాంతాన్ని సూళ్లూరుపేట మున్సిపాలిటీకి తలమానికంగా అభివృద్ధి చేస్తాం అని ఉయ్యాల ప్రవీణ్ హామీ ఇచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com